మిషన్ భగీరథ లీలలు చోద్యం చూస్తున్న మున్సిపాలిటీ అధికారులు.

 అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్.

వనపర్తి:ఆగస్టు 9 (జనం సాక్షి)వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎం ఆర్ ఓ ఆఫీస్ ముందు సోమవారం ఉదయం నట్ట నడి రోడ్డున టర్మిoగ్ లో మిషన్ భగీరథ గుంతలో ఎమ్మెల్యే అభ్యర్థి బూజుల వెంకటేశ్వర్ రెడ్డి కారు ఇరుక్కొని నానా తంటలు.తమ ఆఫీసు నుండి రోడ్డు టర్నింగ్ అయ్యే క్రమంలో మిషన్ భగీరథ కోసం తవ్విన గుంతలో కారు ఇరుక్కుపోయిందని అదే సమయంలో అటు నుండి పోతున్న అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ తదితరులు అక్కడికి చేరుకొని కారుని గుంతలో నుండి బయటికి తీశారు.మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం తవ్వకాలు జరిపి కొన్ని చోట్ల అలాగే వదిలేయంతో వర్షం నీళ్లతో నిండి ప్రమాదకరంగా గుంతలు ఏర్పడ్డాయని చూసేవారికి వర్షం నీటిలో ఆ గుంతలు కనిపించకపోవడంతో అటు నుంచి వెళుతున్న పాదాచార్యులు,ద్విచక్ర వాహన దారులు గుంతలో పడి ప్రమాదాలకు గురవుతున్నారని ఆయన వాపోయారు. కౌన్సిలర్ గాని ఇతర అధకారులు గాని పట్టించుకోకపోవడంతో వనపర్తి మొత్తంలో ఇలాంటి గుంతలు కోకోల్లలుగా ఉన్నాయని వెంటనే పూడ్చి వేయాలని సతీష్ యాదవ్ డిమాండ్ చేశారు.అలాగే మిషన్ భగీరథ పైప్ లైన్లు తవ్విన ప్రతి చోట రోడ్డు వేయాలని దాని నామ్స్ ప్రకారం నిధులు ఏ విధంగా ఖర్చు పెట్టాలో చెప్పాలని వారన్నారు.అదేవిధంగా నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారన్నారు.