మిస్సింగ్ కేసు నమోదు

లింగంపేట్ 20 జూలై
(జనంసాక్షి)
 లింగంపేట్ మండలంలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన గండిగారి అల్లూరి కనబడడం లేదని తండ్రి గండిగారి చంద్రయ్య ఫిర్యాదు మేరకు బుదువారం మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగిందని లింగంపేట్ ఎస్ఐ శంకర్ తెలిపారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.కన్నాపూర్ గ్రామానికి చెందిన గండిగారి అల్లూరి కుటుంబ విషయంలో అప్పుడప్పుడు భార్య భర్తలు గొడవపడి నా కొడుకు బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి మళ్ళీ వచ్చే వాడిని గత రెండు నెలల క్రితం భార్య భర్తలు సంసారం విషయంలో గొడవపడి నా కోడలు భారతి తల్లి గారింటికి దేమేకలన్ పిల్లలతో సహా వెళ్లిపోయిందని వారు వెల్లిన 15 రోజులకు నా కొడుకు అల్లూరి ఇంట్లో నుండి వెళ్లిపోయారని అప్పటినుండి నా కొడుకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది.ఎక్కడ వెతికిన నా కుమారుడి ఆచూకి తెలియడం లేదని అల్లూరి వెళ్ళె టప్పుడు బ్లాక్ కలర్ జీన్స్ ప్యాంట్ బ్లూకలర్ షర్ట్ ధరించి ఉన్నారని.ఎత్తు 5.6 తెలుగు భాషమాత్రమే మాట్లాడతాడని తండ్రి ఫిర్యాదు చేయగ ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ తెలిపారు.
Attachments area