ముందస్తు బంద్‌కు పోలీస్‌ అధికారుల అనుమతి పొందాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 7: జిల్లాలో విద్యాసంస్థల బందుకు పిలుపును ఇచ్చే రాజకీయపార్టీలు విద్యార్థి సంఘాల నాయకులు ముందుగా పోలీసు శాఖ అనుమతిని పొందాలని జిల్లా ఎస్పీ విక్రం జిత్‌ దుగ్గల్‌ అన్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి, ఆర్మూరు, బోధన్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని విద్యాసంస్థల నిర్వాహాకులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ప్రజలకు ముందస్తు సమాచారం లేకుండా బందుకు పిలుపు ఇవ్వవద్దని అన్నారు. సంబంధిత పోలీస్‌ అధికారుల అనుమతి తప్పనిసరిగా పొందాలని అన్నారు.  బంద్‌ సమాచారం అందించకుండా నిర్వహించవద్దని అలా నిర్వహించిన వారికి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బంద్‌ విషయమై ముందుగానే పోలీస్‌ అధికారులకు విద్యాసంస్థలయజమానులకు, విద్యార్థులకు సమాచారం అందించాలని ఎస్పీ తెలిపారు.