ముంబై కరోనా ఉగ్రపంజా

ముంబయి,ఏప్రిల్‌ 24(జనంసాక్షి): దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కరోనా మహమ్మారి రోజురోజుకీ ఉగ్రరూపం దాుస్తోంది. శుక్రవారం ఒక్క రోజే కొత్తగా 357 పాజిటివ్‌ కేసుÑ 11 మరణాు నమోదయ్యాయి. మరోవైపు, ఈ ఒక్క రోజులోనే 122మంది కోుకొని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకు ముంబయి మహానగరంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య 4589గా నమోదయ్యాయి. వీటిలో 595మంది కోుకోగా.. 179మంది ప్రాణాు కోల్పోయినట్టు బృహాన్‌ ముంబయి కార్పొరేషన్‌ (బీఎంసీ) విడుద చేసిన బులెటిన్‌లో వ్లెడిరచింది.ముంబయి మురికివాడ ధారవిలో కరోనా తీవ్రత కవరపెడుతోంది. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో 214పాజిటివ్‌ కేసు నమోదుకాగా 13మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటికే దీన్ని కేంద్రప్రభుత్వం హాట్‌స్పాట్‌గా ప్రకటించింది. దీంతో బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌ ఇప్పటివరకు 813 కంటైన్మెంట్‌ జోన్లను ప్రకటించింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా తాజాగా కేంద్ర ఆరోగ్య బృందాు మహారాష్ట్రలో పర్యటించి పరిస్థితి సవిూక్షించాయి. లాక్‌డౌన్‌ నిబంధనను పటిష్టంగా అముచేయడం తోపాటు వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యపై స్థానిక అధికారుకు సూచను ఇచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కేసు సంఖ్య రెట్టింపునకు 7రోజు పడుతున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే వ్లెడిరచారు.