ముఖాలు చూసి టికెట్లు ఇవ్వం

` పనిచేసేవారికే ప్రాధాన్యత
` రాష్ట్ర కమిటీ మినహా అన్నింటినీ రద్దు చేశాం
` చాలా పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి
` 25 ఏళ్లు పూర్తి చేసుకున్న పార్టీలు చాలా తక్కువ
` కొత్త పార్టీని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు: కేటీఆర్
హైదరాబాద్(జనంసాక్షి):కవిత కొత్త పార్టీపై కేటీఆర్ స్పందించారు. చాలా పార్టీలు వస్తుంటాయి పోతుంటాయని కవిత తెలంగాణ రాష్ట్ర సేనపై పరోక్షంగా వ్యాఖ్యానించారు. 25 ఏళ్లు పూర్తి చేసుకున్న పార్టీలు చాలా తక్కువని, కొత్త పార్టీని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. బీఆరఎస్ అధినేత కేసీఆర్ గురించి చాలామంది మాట్లాడుతున్నారని అవన్నీ పట్టించుకోనక్కర్లేదని తోసిపుచ్చారు. సింగరేణి కార్మికులకు అమలు చేసిన పథకాలపై చర్చించామన్న ఆయన తెలంగాణలోని సబ్బండ వర్గాలు, సకల జనులకు ధన్యవాదాలు చెబుతూ తీర్మానం ప్రవేశపెట్టినట్లు తెలిపారు.తెలంగాణ ఉద్యమంలో సహకరించిన వారు, తమతో కలిసి నడిచిన వారికి ధన్యవాదాలు చెబుతూ తీర్మానం చేసినట్లు కేటీఆర్ తెలిపారు. అరాచక కాంగ్రెస్ పాలనకు సంబంధించి భేటీలో నిర్ణయాలు తీసుకున్నామని, రైతుబంధు తీసుకువచ్చి రైతులను ఆదుకోవడాన్ని ఐక్య రాజ్య సమితి ప్రశంసించిందన్నారు. రైతుబంధును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు.విడతల వారీగా రైతులకు డబ్బులిస్తూ ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో సంక్షోభంపై విస్తతంగా చర్చించినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ధాన్యం దళారుల పాలైపోయిందని ఆక్షేపించారు. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు నడవట్లేదని, ప్రభుత్వం ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేశారు. ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేయకపోతే గ్రామాల్లో బీఆరఎస్ ఉద్యమిస్తుందని హెచ్చరించారు.బీఆరఎస్ పార్టీ రాష్ట్ర స్థాయి కమిటీ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీలను రద్దు చేశామని కేటీఆర్ తెలిపారు. తమ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు బూత్ స్థాయి నుంచి అన్ని స్థాయిల్లో పార్టీ నూతన కమిటీలు వేయనున్నట్లు ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలోని కార్యకర్తలందరికీ శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. బీఆరఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ పద్ధతుల్లో నిర్వహిస్తామన్నారు.తెలంగాణ భవన్‌లో బీఆరఎస్ రజతోత్సవ ముగింపు కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ పలు అంశాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత రాష్ట్రస్థాయి ప్రతినిధుల భేటీలో మాట్లాడిన ఆయన బీఆరఎస్ రాష్ట్ర కమిటీ మినహా అన్ని కమిటీలు రద్దు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఇదే సమయంలోకాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ఘాటు విమర్శలు చేశారు.బీఆరఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న పునరంకిత సందర్భం అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. బీఆరఎస్ పాతికేళ్ల ప్రస్థానం పూర్తి సందర్భంగా కేటీఆర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. స్వీయ రాజకీయ అస్తిత్వ పతాకం రెపరెపలాడుతూ సిల్వర్ జూబ్లీ వేడుకను జరుపుకుంటున్నామన్నారు. 25 వసంతాల మైలురాయిని అధిగమించిన మహోజ్వల లాంగ్ మార్చ్ అని పోస్ట్ చేశారు. బీఆరఎస్ రాజకీయ పార్టీ కాదని ఒక విప్లవం అని అభివర్ణించారు. పార్టీ కార్యకర్తలకు, సోషల్ విÖడియా వారియర్లకు, అభిమానులకు, నాయకులకు, బీఆరఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.