ముఖ్యమంత్రితో సమావేశం కానున్న డీఎస్
హైదరాబాద్, జనంసాక్షి: పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ శనివారం ఉదయం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని కలిశారు. ఎల్లుండి సీఎం ఢిల్లీ వెళ్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రక్షాళన జరగవచ్చనే అంచనాల నేపథ్యంలో మరోసారి పీసీసీ చీఫ్ పదవిని దక్కించుకునేందుకు డీఎస్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.