ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలకు భద్రత లేదు.

విఆర్ఏలు గ్రామాలకు పోలీసులుగా పని చేశారు.
వీఆర్ఏ ల సమస్యలను పరిష్కరించాలి.
యూటీఫ్ జిల్లా అధ్యక్షుడు వహీద్ ఖాన్.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు5(జనంసాక్షి):
గత పనెండు రోజులుగా వీఆర్ఏలు నిరవధిక సమ్మె చేస్తున్నారని, వారిని రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం దుర్మార్గమేనని వారిపై సీఎం కేసీఆర్ కక్ష సాధింపు చేస్తున్నారన యూటీఫ్ జిల్లా అధ్యక్షుడు వహీద్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు.శుక్రవారం వీఆర్ఏలు చేస్తున్న దీక్ష శిబిరాన్ని సందర్శించి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. సంవత్సరాల పాటు గ్రామాలలో అనేక రకాల సేవలు అందించారని గ్రామానికి ఒక పోలీసులా వ్యవహరిస్తూ అనేక సమస్యలు పరిష్కారాలు చేశారని అన్నారు.కొత్త కోరికలు ఏమి కోరడం లేదని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీనే అమలు చేయాలని అడుగుతున్నారని దానిపై స్పందించక పోవడం దుర్మార్గమని అన్నారు.ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకే భద్రత లేకపోతే రాష్ట్రంలో ముఖ్యమంత్రి పాలన ఎలా ఉందో అర్థమవుతున్నదని అన్నారు. చేస్తున్న సమ్మెకు యూటీఫ్ ఎల్లవేళలా తోడు ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆంజనేయులు, సత్యనారాయణ,మల్లేష్, రమేష్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.