ముగజీవాలు చనిపోతున్నా- పట్టించుకోరా…!! – కంచలేని ట్రాన్స్ పార్మర్లు- మృత్యువాత పడుతున్న మూగజీవాలు – భయం గుపెట్లో జీవనం కొనసాగిస్తున్న ఆయా గ్రామాల ప్రజలు – పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు
క్రైమ్ మిర్రర్, పరిగి :
జనవాసాలు సంచరించు ప్రదేశాలు, రహదారుల వెంబడి కంచలేని ట్రాన్స్ పార్మర్లను విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. కానీ… వాటికి కంచెలు ఏర్పాటు చెయ్యక పోవడంతో ప్రమాదకరంగా మారుతున్నాయి. కంచలేని ట్రాన్స్ పార్మర్ల కారణంగా పలు గ్రామాలలో మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. దీనితో పాడి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. మూగజీవాలే కాకుండా జనవాసాలు సంచరించే ప్రదేశాలు, ఇళ్ల మధ్యలో వున్న ట్రాన్స్ పర్మర్లతో చిన్నారులు అటువైపు వెళ్లి ఎక్కడ ప్రమాదాల బారిన పడుతారోనని ఆయా గ్రామాల ప్రజలు కంచలేని ట్రాన్స్ పార్మర్ల కారణంగా భయం గుప్పెట్లో జీవనం కొనసాగిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని పరిగి మండలంలో 3 సబిస్టేషన్లు వుండగా పురపాలికల్లో 150, మండలంలో వ్యవసాయ, ఇళ్లకు సంబందించి దాదాపు 15 వందలకు పైగా, దోమలో 5 సబిస్టేషన్లు దాదాపు 18 వందలు, కులక్చర్ల, చౌడపూర్ మండలాల్లో 6 సబిస్టేషన్లు సుమారు 15 వందలు, వికారాబాద్ డివిజన్ పరిధి పుడూర్ మండలంలో 3 సబిస్టేషన్లు 11 వందల ట్రాన్స్ పార్మర్లు ఉన్నాయి. వీటిలో కేవలం పరిగి పురపాలికలో 100, దోమ 45 కులచర్ల, చౌడపూర్ లలో 50, పుడూర్ లో 25 ట్రాన్స్ పారమర్లకు మాత్రమే కంచెలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గ వర్గంలో ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ట్రాన్స్ పారమర్లకు విద్యుత్ శాఖ అధికారులు ఎక్కడ కూడా కంచేలు ఏర్పాటు చేయకపోవడంతో మొన్నటికి మొన్న కులక్చర్ల మండల పరిధిలోని సాల్విడ్ గ్రామంలో ట్రాన్స్ పార్మర్ కు వద్ద విద్యుతాగానికి గురై పాడి ఆవు మృతి చెందగా, చౌడపూర్ మండలం మందిపాల్ గ్రామంలో గల ట్రాన్స్ఫార్మర్ తో షాక్ తగిలి రెండు మేకలు మృత్యువాత పడ్డాయి. దీనితో ఆయా గ్రామాల ప్రజలు ఎప్పుడు ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందో అని భయం గుప్పెట్లో జీవనం సాగిస్తున్నారు. ఇదిలా వుంటే ఎక్కడ చూసిన ఇళ్లపై విద్యుత్ తీగలు ఉండడంతో గతంలో పురపాలికలోని ఓ ఇంటి పై నుండి హై టెన్షన్ విద్యుత్ తీగలు వెళ్లడంతో ఆ ఇంటి పైకప్పు పై చిన్నారులు అడుకుంటుండగా ప్రమాద వశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో ఓ చిన్నారుడు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన లేకపోలేదు. ఇలాంటి సంఘటనలు తరచు సంబంధించినప్పటికీ సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు మాత్రం మాకు ఎందుకులే అన్న విదంగా వ్యవహారిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కంచేలు లేని ట్రాన్స్ పార్మర్లకు కంచేలు ఏర్పాటు చేయ్యాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.
ప్రమాదకర ట్రాన్స్ పార్మర్లకు కంచె ఏర్పాటు చెయ్యాలి..
– సీపీఐ మండల సహాయ కార్యదర్శి బి.మల్లేష్
ట్రాన్స్ పార్మర్లకు కంచెలు లేకపోవడంతో మూగజీవాలు మృత్యువాత పడడమే కాకుండా జనవాసాలు సంచరించే ప్రదేశాలలో వీటిని ఏర్పాటు చెయ్యడంతో వీటికి కంచెలు లేక ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని భయం గుప్పెట్లో ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారు. ప్రమాదకరంగా వున్న ట్రాన్స్ పారమర్ల ను సంబంధిత అధికారులు గుర్తించి వెంటనే కంచెలు ఏర్పాటు చెయ్యాలని సీపీఐ మండల సహాయ కార్యదర్శి బి.మల్లేష్ డిమాండ్ చేశారు.
—————-
ఫొటో రైటప్, పరిగి, 01 : కంచలేని ట్రాన్స్ పార్మర్ తో విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన పాడి ఆవు
ఫొటో రైటప్, పరిగి, 02 : సీపీఐ మండల సహాయ కార్యదర్శి బి. మల్లేష్ ఫొటో
——————-