ముగిసిన ఎంప్లాయిస్‌ యూనియన్‌ దీక్షలు

కందుకూరు , జూలై 28 : ఆర్టీసి రీజనల్‌ సెక్రటరీ విజయారావుపై యాజమాన్యం విధించిన అక్రమ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని స్థానిక ఆర్టీసి డిపో ఆవరణంలో ఇయు ఆధ్వర్యంలో గత 10 రోజులుగా జరుగుతున్న రిలే నిరాహారదీక్షలు శనివారంతో ముగిశాయి. ఈ దీక్షలో కార్మికులు బిపిరెడ్డి, పి మధు కూర్చున్నారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరానికి చేరుకొని డిపో కార్యదర్శి పి రామ్మూర్తి వారిరువురికి నిమ్మరసం ఇచ్చి దీక్షలు ముగుస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇయు రాష్ట్ర కార్యదర్శి పద్మాకర్‌ యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయని, అందువలన దీక్షలు విరమిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇయు నాయకులు మాధవరావు, పివి రావు, బాబు, శివయ్య, ఆదినారాయణ, బాబురావు, కార్మికులు పాల్గొన్నారు.