ముగిసిన బాబు మార్క్‌ కలెక్టర్ల సదస్సు

అభివృద్ది, విభజన సమస్యలపైనే అధిక ఫోకస్‌
రానున్న ఎన్నికలే ఎజెండగా కార్యాచరణ
అమరావతి,మే10(జ‌నం సాక్షి): రెండురోజుల పాటు కలెక్టర్ల సదస్సు ముగిసిన తీరు చూస్తే బాబు ఓ వైపు అధికారులను బుజ్జగిస్తూనే..మనదే మంచి టీమ్‌ అంటూనే రానున్న ఎన్నికలకు సమాయత్తం అవుతున్నట్లుగా ప్రస్ఫుటం చేశారు. తన నివాసంలోని గ్రీవియెన్స్‌ సెల్‌లో మంగళ, బుధవారాల్లో నిర్వహించిన కలెక్టర్ల సదస్సు ముగిసింది. ఈ సందర్భంగా ఆయన వివిధ శాఖల పనితీరు, మురదుకు సాగాల్సిన అంశాలపై కలెక్టర్లు, అధికారులతో సవిూక్షిరచారు. గతంలో మాదిరిగానే వృద్ధిపైనే ఎక్కువ దృష్టి సారిరచిన ఆయన సంక్షేమంపైనా మాట్లాడారు. అలాగే విభజన అంశాలపై కలెక్టర్ల సదస్సులో చెప్పుకొస్తున్న చంద్రబాబు ఈ సారి కూడా ఆ కష్టాలనే అధికారులకు వివరించారు. కేంద్రం చేసిన అసంబద్ధ విభజన కారణంగా తలెత్తిన కష్టాలు, తద్వారా నెలకొన్న తలసరి ఆదాయం సమస్యలు, అయినా అభివృద్ధి కోసం ముందుకు సాగుతున్న వైనంపై అధికారులకు సుదీర్ఘంగా వివరిరచి చెప్పారు. ఈ కష్టాల నురచి బయటపడేరదుకు అధికారులు దృఢచిత్తంతో పనిచేయాలని పిలుపునివ్వడం గమనార్హం. తొలి రోజే సంక్షేమంపై చర్చించిన ఆయన పలు కోణాల్లో దిశా నిర్దేశం చేశారు.అధికారులతో నిర్వహిరచిన వివిధ సమావేశాల్లో కూడా ఎన్నికలకు మురదుగా అనుసరిరచాల్సిన వ్యూహాలపైనే చంద్రబాబు ఎక్కువగా దృష్టి పెట్టారు. పింఛన్లు, వివిధ కులాలకు ఇస్తున్న ప్రోత్సాహకాలు, సంక్షేమ పథకాలను వేగవంతం చేయకపోతే ప్రజల నుంచి విమర్శలు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఓట్లు సంపాదించిపెట్టే పథకాలపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెడుతున్నారు. ఇటువంటి పథకాలపై నిర్లక్ష్యం వద్దని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. తాజాగా ముగిసిన కలెక్టర్ల సదస్సులో కూడా ఇదే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. రెండు రోజులపాటు నిర్వహించిన ఈ సదస్సులో వివిధ సంక్షేమ పథకాల అమలు క్షేత్రస్థాయిలో ఎలా ఉందన్న కోణంలోనే అధికారులతో చర్చించారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆయా పథకాల అమలుపై మరిరతగా దృష్టి పెట్టాలని ఆయన స్పష్టం చేశారు.  అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం అనుకున్న విధంగా పథకాల అమలు లేదని వెల్లడైరది. ఇదే అరశంపై ఆయన నిశితంగానే స్పందిరచారు.
క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి, పథకాల అమలు జరుగుతున్న తీరును రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ (ఆర్‌టిజి)తో అనుసంధానం చేసుకుని అధ్యయనం చేయాలని, తద్వారా పనితీరును మరిరత మెరుగుపరచుకునేరదుకు ఆస్కారం ఉంటురదని ఆయన హితవు పలికారు. గత సదస్సుల మాదిరిగానే ఈ సారి కలెక్టర్ల సదస్సులో కూడా అవినీతిపై మాట్లాడడం విశేషం. అవినీతి రహితంగా మురదుకు సాగాలని అధికారులకు సూచించారు. అవినీతికి పాల్పడే వారిపై కఠినంగా వ్యవహించాల్సి ఉంటుందని పునరుద్ఘాటిరచారు. త్వరలో వర్షాకాలం రానున్నరదున తీసుకోవాల్సిన చర్యలు, మరో రెరడు నెలలపాటు తాగునీటి ఎద్దడి లేకుండా చూడాల్సిన అవసరంపైనా దిశా నిర్దేశం చేశారు. అలాగే వర్షాకాలంలో రోడ్ల పరిస్థతి దిగజారకుండా చూసుకోవాలని కూడా మురదస్తు హెచ్చరికలు జారీ చేశారు. గత కలెక్టర్ల సదస్సుల్లో కూడా రోడ్లపై పలు ఆదేశాలు జారీచేసినప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించలేదు. ఇదే అరశాన్ని కొరతమంది అధికారులు సమావేశ
మందిరం బయట చర్చిరచుకోవడం కనిపించింది. ఎన్ని ఆదేశాలు ఇచ్చినా క్షేత్ర స్థాయిలో పరిస్థితి అధ్వానంగానే ఉరదని ఒక కార్యదర్శి స్థాయి అధికారి వ్యాఖ్యానించారు.  ఇక చివరిగా గతంలో మాదిరిగా కాకుండా కొరత మాట్లాడే సమయం కలెక్టర్లకు ఈసారి లభిరచడం కొసమెరుపు. గత సదస్సుల్లో కలెక్టర్లకు ఐదు, పది నిముషాల సమయాన్ని అధికారికంగా కేటాయిరచినప్పటికీ, సమావేశంలో మాట్లాడే అవకాశాలు లభించలేదు. అయితే తాజా సదస్సులో గతానికి భిన్నంగా మాట్లాడేందుకు కొరత సమయం లభించడం కలెక్టర్లకు ఆనందం కలిగిరచేదిగానే చెప్పాలి. మొత్తంగా బాబు గతంలో తాను హైదరాబాద్‌ అభివృద్ది చేయడం, ఐటిని పరుగెత్తించడం, ఇప్పుడు ఎపిని నంబర్‌వన్‌గా నిలపడం వంటి అంశాలను బాగా ప్రొజెక్ట్‌ చేయడం ద్వారా ప్రజలకు గట్టి సందేశం ఇవ్వాలని చూశారు.