ముగ్గురు ఇంజనీర్లపై వేటు
వరంగల్, జూలై 10 : మునిసిపల్ కార్పొరేషన్‌లో ముగ్గురు ఇంజనీర్లపై వేటు పడింది. విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఇఇ శివకుమార్, డిఇ కొండలరావును మునిసిపల్ కమిషనర్ సస్పెండ్ చేశారు. ఇఇ రామస్వామిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ తిప్పి పంపారు. ఇంజనీరింగ్ పనులకు సంబంధించి సంతకాలను ఫోర్జరీ చేసి విధులను దుర్వినియోగం చేశారంటూ ఈ ఇంజనీర్లపై ఆరోపణలు రావడంతో వారిపై చర్యలు తీసుకున్నారు.