ముగ్గురు బిజెపి ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ గుర్తుకు లేదా?

కెటిఆర్‌ ట్వీట్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్‌ కౌంటర్‌

హైదరాబాద్‌,జూలై27(జనంసాక్షి ): ఎంపీల సస్పెషన్‌ గురించి మాట్లాడే అర్హత టీఆర్‌ఎస్‌కు లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. రాజ్యసభలో ఛైర్మన్‌ తీసుకున్న నిర్నయాన్ని ఎలా ప్రశ్నిస్తారని అన్నారు. గతంలో అసెంబ్లీ నుంచి ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేసినప్పుడు కేటీఆర్‌ ఎక్కడున్నాడని రాజసింగ్‌ ప్రశ్నించారు. ఏకపక్షంగా మొత్తం సెషన్‌ అయిపోయే వారకు ముగ్గరు ఎమ్మెల్యేలను సస్సెండ్‌ చేసినప్పుడు విలువలు గుర్తుకు రాలేదా అన్నారు. ఇక్కడ చేసిన తప్పులను మరి విమర్శలు చేయడం కెటిఆర్‌కు చెల్లిందన్నారు. ఇకపోతే ఓటీటీ షోల గురించి కేటీఆర్‌ సలహా అడగటం సిగ్గుచేటని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్‌ కాలికి గాయం కావడంతో ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏవైనా బెస్ట్‌ ఓటీటీ షోస్‌ ఉంటే సూచించగలరని కేటీఆర్‌ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్‌ రాజాసింగ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా చూడాలని తెలిపారు. లేదంటే వాజ్‌ పేయి, మోదీ చరిత్రను కేటీఆర్‌ తెలుసుకోవాలన్నారు. ఇలా ఓటీటీ షోల గురించి కేటీఆర్‌ సలహా అడగటాన్ని రాజాసింగ్‌ సిగ్గుచేటు చర్యగా అభివర్ణించారు.

తాజావార్తలు