ముగ్గుల పోటీలు

గుడిహత్నూర్: ఆగస్టు 20 జనం సాక్షి)స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా శనివారం గుడిహత్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఐకేపి ఆధ్వర్యంలో  ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో పాల్గొన్న పలువు మహిళలు యువతులు పలు రకాల ముగ్గులు వేశారు పోటీల్లో గెలుపొందిన వారికి తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీఓ సునీత బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ జాదవ్ సునీత, ఐకేపి ఏపీఎం భాగవాండ్లు ఉప సర్పంచ్ గజానంద్, పంచాయతీ సెక్రెటరీ రాందాస్ ఐకెపి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు