ముత్యంపేటలో తల్లిపాల వారోత్సవాలు.
మల్లాపూర్, (జనంసాక్షి) ఆఘష్టు:05
మండలంలోనిముత్యంపేట్ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ల అధ్వర్యంలో తల్లి పాల వారోత్సవాలు ఘానంగా నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు భవిష్యత్తు లో సంపూర్ణ ఆరోగ్యం గా ఉండాలంటే తల్లి పాలు ఖచ్చితంగా తాగించాలన్నారు.తల్లులు మంచి పౌష్ఠికాహరం తిసుకుంటానే మీ పిల్లలు ఆరోగ్యం గా ఉంటారనీ అన్నారు.మీ పాలను పిల్లలకు పటించి.బిడ్డ ఆరోగ్య రక్షణ కు కృషి చేయాలనీ కోరారు.వైస్ ఎంపీపీ గౌరి నాగేష్ మాట్లాడుతూ పుట్టిన తరువాత వచ్ఛె తల్లి ముర్రీపాలు బిడ్డకు రోగ నిరోధక శక్తి పెంచి భవిష్యత్తు దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా పిల్లలు ఆరోగ్య వంతంగా ఉంటారనీ అన్నారు. తల్లి పాలు పిల్లలకు ఎంతో అవసరం ఉంటాయో.టికాలు కూడ పిల్లలకు క్రమం తప్పకుండా అన్ని డోసులు వేయించాలనీ కోరారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొల్లం కృష్ణవేణి, వైస్ ఎంపీపీ గౌరు నాగేష్, ఉప సర్పంచ్ అల్లూరి మహేష్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ముబిన్, అంగన్వాడీ టీచర్లు ఆమేటి శ్రీలత, సుద్దాల కృష్ణవేణి, దాసరి లక్ష్మి, ఏఎన్ఎం రమ, ఆశా వర్కర్లు నల్ల వనిత, సుజాత, శాంతా, లయ, గర్భిణీలు బాలింతలు పాల్గొన్నారు.