ముత్యాలమ్మ తల్లి బోనాల వేడుకలో పాల్గొన్న – జడ్పిటిసి బండి వెంకటరెడ్డి
గుండ్రాతిమడుగు లో బోనాల సందడి
కురివి ఆగస్టు-10 (జనం సాక్షి న్యూస్)
కురవి మండలం గుండ్రాతి మడుగు గ్రామంలో బోనాల పండుగ స్థానిక సర్పంచ్ జంగిలి హరిప్రసాద్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మహిళలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ముస్తాబై, నెత్తి పైన బోనం ఎత్తుకొని డప్పు చప్పుళ్లు కోలాటాలు మధ్యన సామూహికంగా ఊరేగింపుగా బయలుదేరి గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ముందుగా గ్రామ దేవతలకు బోడ్రాయికి నైవేద్యం సమర్పించారు. అనంతరం ముత్యాలమ్మ గుడి వద్దకు చేరుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు ,బోనం సమర్పించి తమ పిల్లాపాపలుచల్లగా ఉండాలని అమ్మవారిని కొలిచారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ జంగిలి హరిప్రసాద్,టిఆర్ఎస్ నాయకులు కోటేష్, బండి భాస్కర్,నాగేష్, ప్రజా ప్రతినిధులు,గ్రామ పెద్దలు,మహిళలు అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.