ముదిరాజ్ యువ గర్జన సభ సన్నాహక సమావేశం

ముదిరాజ్ లు రాజకీయం గా ఎదిగాలి.
తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీను.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై 29(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సాయి గార్డెన్స్ లో శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా నియోజకవర్గ ముదిరాజ్ ముఖ్యనాయకు లతో సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ముదిరాజ్ మహాసభ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గుండ్రపల్లి శ్రీను ముదిరాజ్ మాట్లాడుతు చెరువు కుంటలే మన జీవన విధానం అని, ముదిరాజ్ లు రాష్ట్ర వ్యాప్తంగా 52 లక్షల జనాభా ఉన్నామని,కావున మనం కూడా ఆర్థికంగా రాజకీయం ఎదగాలి అని తెలిపారు. నీటి వనరులు, చెరువు శిఖం లేని చోట వచ్చే సంవత్సరం ప్రతి మత్స్య కారుడికీ మార్కెటింగ్ సొసైటీ ద్వారా సభ్యత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అని తెలిపారు.నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో 10 వేల మంది యువకులతో యువగర్జన నిర్వహిస్తాం అని తెలిపారు.తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర యువజన విభాగం పిలుపు మేరకు నాగర్ కర్నూల్ జిల్లా లోని అన్ని మండలాల్లో గ్రామంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ యువజన విభాగం కమిటీ, మండల కేంద్రము లో మండల కమిటీ నీ , నియోజకవర్గ స్థాయి లో, మున్సిపల్ పరిధి లో యువజన విభాగం కమిటీలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ముదిరాజ్ మహాసభ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లుడు జగన్ మాట్లాడుతూ దేశ , రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి యువత రాజకీయాల్లోకి రావాలి అని తెలిపారు.ఏ పార్టీ కీ అయిన యువతే ముఖ్యమని, మన ముదిరాజ్ యువత మలిదశ తెలంగాణ ఉద్యమం లో కీలక ప్రాత పోషించారని తెలిపారు.నేను సైతం మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ లో పోరాటం చేశానని చెప్పారు. స్వరాష్ట్ర సాధన కోసం 45 రోజుల జైలు జీవితం గడిపాను అని తెలిపారు. భారీ మొత్తంలో ముదిరాజ్ యువ గర్జన సభను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు జమ్ముల శ్రీకాంత్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా ప్రచార కార్యదర్శి హరికృష్ణ ముదిరాజ్, బిజినపల్లి మత్స్య సహకార సంఘాల మండల అధ్యక్షుడు అల్లోజీ గారు, జిల్లా నాయకులు బంగారయ్య, సొసైటీ మాజీ అధ్యక్షులు భీమ్మయ్య , జిల్లా యువ నాయకుడు యానమోని తిరుపతయ్య, నాగర్ కర్నూల్ మండలం లోని గ్రామ సొసైటీ అధ్యక్షులు వెంకటయ్య, శోభన్, సహాదేవుడు, రాము, జిల్లా నాయకులు తవిటి శంకర్, రమేష్, వెంకటేష్, నవీన్, బాలరాజు, వంశీ, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు….