ముదిరాజ్ ల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి

మద్దూరు ఎంపీపీ బద్దీపడగ కృష్ణారెడ్డి
మద్దూరు (జనంసాక్షి) అక్టోబర్ 23 : ముదిరాజ్ ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మద్దూరు ఎంపీపీ బద్దీపడగ కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఉమ్మడి మద్దూరు, దూల్మీట్ట మండలాల్లోని 31 చెరువుల్లో 11 లక్షల చేప పిల్లలను వదిలారు. వల్లంపట్ల గ్రామంలో వారు విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ముదిరాజుల అభ్యున్నతికై ప్రవేశపెట్టిన చేప పిల్లలకు పెంపకం పట్ల ముదిరాజ్ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో అన్ని కుల కుల సంఘాల అభివృద్ధి కోసం పనులు జరుగుతున్నాయని ఎంపీపీ కృష్ణారెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి మద్దూరు దూలిమిట్ట మండలాల ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు చొప్పరి సాగర్ ముదిరాజ్, వైస్ ఎంపీపీ మలిపెద్ది సుమలత-మల్లేశం, నాగిళ్ల తిరుపతిరెడ్డి, స్థానిక ఎంపీటీసీ గుళ్ల సత్యకళ ఆనందం, బైరాన్ పల్లి ఎంపీటీసీ నందనబోయిన నర్సింహులు, తెరాస మద్దూరు మండల అధ్యక్షుడు మేక సంతోష్, పీఏసిఎస్ చైర్మన్ నాగిళ్ల తిరుపతి రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ కొండా అంజయ్య, సోసిటి అద్యక్షులు నారదాసు శ్రీదర్, వార్దు సభ్యులు నారదాసు రాజు, టిఆర్ఎస్ మండల నాయకులు తాళ్లపల్లి బిక్షపతి, స్థానిక ఉప సర్పంచ్, కర్నే మనోహర్, టీఆర్ఎస్ మద్దూరు మండల మహిళా అద్యక్షులు పోగుల మమత, సోషల్ మీడియా మద్దూరు మండల అద్యక్షులు మాచర్ల రఘు, ఆయా గ్రామాల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, సొసైటీ అధ్యక్షులు,టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area