ముదిరి పాకాన పడ్డ ‘కర్ణాటకం’
8 మంది మంత్రుల రాజీనామాకర్ణాటక
జూన్ 29 (జనంసాక్షి):
కర్ణాటకలో బీజేపీి ప్రభుత్వంలో కొనసాగుతున్న సంక్షోభం శుక్రవారం ముదిరిపాకాన పడింది.రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై గట్టి పట్టున్న బి.ఎస్.యడ్యూరప్ప విధేయులైన ఎనిమిది మంది మంత్రులు శుక్రవారం తమ రాజీనామా పత్రాలను ముఖ్యమంత్రి డి.వి.సదా నందగౌడకు సమర్పించారు.గౌడ అధికారిక నివాసం నుంచి వెలుపలకు వచ్చిన పీిడబ్ల్యూడీ శాఖ మంత్రి సి.ఎం.ఉదాసి విలేఖరులతో మాట్లాడుతూ నగరంలో లేని శోభాకర్న్‌దాలజే సహా ఎనిమిది మంది మంత్రులు ముఖ్యమంత్రికి తమ రాజీనామాలను వ్యక్తిగతంగా సమర్పించారని తెలిపారు. ఉదాసీతో పాటుగా రాజీనామా చేసిన మంత్రుల్లో జగదీష్ షెట్టర్, వి సోమన్న, బసవరాజ్ బొమ్మయ్ మురుగేశ్ నిరాని, రేవు నాయక్ బెలమాగి, ఎంపి రేణుకాచార్య, ఉమేశ్ కుట్టి ఉన్నారు. మరో మంత్రి రాజు గౌడ శనివారం రాజీనామా చేస్తారని ఉదాసి తెలిపారు. నిగత మూడు నుంచి నాలుగు మాసాలుగా ముఖ్యమంత్రి,మంత్రుల మధ్య అవిశ్వాసం పొడసూపింది.బీజేపీ శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రిపై వత్తిడి చేస్తూ వస్తున్నాం.కానీ అలా జరగలేదుకు అని ఆయన వివరించారు.