మునుగోడులో గౌడ ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న జిల్లా నాయకులు సమ్మయ్య గౌడ్

కేసముద్రం అక్టోబర్ 21 జనం సాక్షి / శుక్రవారం రోజున మునుగోడు నియోజకవర్గం కొంపల్లి గ్రామ ఎంపీటీసీ పరిధికి ఇన్చార్జి గా వహిస్తున్నటువంటి  టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి,ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధుసూదన్
ఆధ్వర్యంలో గౌడ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  ఎక్సైజ్ ,క్రీడా,టూరిజం శాఖామంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.సమావేశ అనంతరం మంత్రి గౌడ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి,గౌడ కాటమయ్య ఆలయ పెద్దలు మరియు కుల సంఘ పెద్దలు దాదాపు 50 మంది సభ్యులకు గులాబీ కండువా కప్పి పార్టీలో కి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం ఇన్చార్జ్ చిలువేరు సమ్మయ్య గౌడ్,పిండిప్రోలు రాజు గౌడ్, శేఖర్ గౌడ్ ఎంపీటీసీ మొగుదాల శ్యామల సాలయ్య గౌడ్, మాజీ సర్పంచ్ నరసింహ గౌడ్, సీనియర్ నాయకులు వీరమల్ల పురుషోత్తం గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Attachments area