మునుగోడు ఆడపడుచుల కన్నీరు తుడిచింది కేసీఆరే

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
శంకరపట్నం జనం సాక్షి అక్టోబర్ 22
మిషన్ భగీరథ నీళ్లతో మునుగోడు ఆడపడుచుల కన్నీళ్లు తుడిచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని రాష్ట్ర సాంస్కృత సారధి చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. శనివారం ఉదయమే మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండలంలోని ధోని పాముల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతి సారధి చేర్మెన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రచారంలో భాగంగా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా జనంతో మమేకం కాగా ఇంటింటికి బొట్టు పెట్టి ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం రసమయి మాట్లాడుతూ… తెలంగాణ ఏర్పడిన తర్వాత కెసిఆర్ ప్రభుత్వం ఏం చేసిందో పల్లెలకు,పట్టణాలకు వెళ్తే తెలుస్తుందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఎవరైనా చనిపోయి అంత్యక్రియలకు పోతే అరగంట కరెంటు ఇవ్వమని అడుక్కునే వాళ్ళమని అన్నారు. నేడు 24 గంటల కరెంటుతో జీవనం సాగిస్తున్నామని అన్నారు. విత్తనాలు, ఎరువుల కోసం గోసపడ్డామని, అన్నింటిని ఎదుర్కొని పంట పండిస్తే కనీసం మద్దతు ధర కల్పించే పరిస్థితి ఉండేది కాదన్నారు. గతంలో కొనుగోలు కేంద్రాలే ఉండేవి కావన్నారు. ఇప్పుడు అన్ని వసతులు మన ముందుకు వచ్చాయని అన్నారు. నేడు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండటంతో పాటు నీరు సమృద్ధిగా లభించడంతో పాటు 24 గంటల కరెంటుతో రైతులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఒకనాడు నల్లగొండ అంటే నీళ్లు లేని ప్రాంతమని మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఫ్లోరైడ్ సమస్య ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లను ఇచ్చేందుకు కూడా ఆలోచించే పరిస్థితి అని, కెసిఆర్ ప్రభుత్వం వచ్చాక ఇంటిముందే నల్ల పెట్టి సురక్షిత తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. మిషన్ భగీరథ పైలాన్ను చౌటుప్పల్లో ఏర్పాటు చేసి ఫ్లోరోసిస్ సమస్యకు శాస్త పరిష్కారం చూపించిన ఘనత ముఖ్యమంత్రి దేనాని అన్నారు. నాలుగేళ్లలోనే మంచినీళ్లు ఇచ్చాం, 24 గంటల కరెంటు, తాగునీరు, సాగునీరు రంగంలో కూడా అద్భుతమైన పురోగతి సాధించామని ఆయన గుర్తు చేశారు.