మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతాం

డోర్నకల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు మాలోత్ నెహ్రూ నాయక్

కురవి సెప్టెంబర్ 20 (జనం సాక్షి న్యూస్)

మునుగోడు ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుదామని డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మాలోత్ నెహ్రూ నాయక్ తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలోని గట్టుపాల్ మండలం 183వ బూత్ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన ఆయన బూత్ స్థాయి కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులకు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భవిష్యత్ కార్యాచరణ పై చర్చించి బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ప్రతి కార్యకర్త ఓ సైనికుడుగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి వెళ్లిపోయిన రాజగోపాల్ రెడ్డికి ఉప ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు సరైన బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ రాష్ట్ర నాయకులు గాంధీ నాయక్,కురవి మండల నాయకులు రాజపుత్,గట్టుపల్ హెడ్ కోటర్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలు, నాయకులు,బూత్ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.