*మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం మరియు నాయకులు

మెట్పల్లి టౌన్ ,అక్టోబర్ 23,
జనంసాక్షి
మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుట్ల నియోజకవర్గానికి చెందిన తెలంగాణ జన సమితి నాయకులు పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండల కేంద్రంలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కోదండరాం తో రాష్ట్ర రైతువిభాగం అధ్యక్షులు మరియు కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జీ కంతి మోహన్ రెడ్డి కల్సి ప్రచారం నిర్వహించారు. మునుగోడు ప్రాంతంలో భునిర్వాసితులకు అండగా నిలిచి వారి పక్షాన నిరంతరాయంగా పోరాడుతున్న పల్లె వినయ్ కుమార్ గౌడ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు కలాల ప్రవీణ్, దుబ్బాక ప్రసాద్, కేశపాక తరుణ్ లతోపాటు కోరుట్ల, ఇబ్రహీంపట్నం కు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.