మునుగోడు గౌడ భవనం ప్రారంభించిన

మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడు
మునుగోడుసెప్టెంబర్20(జనంసాక్షి):
మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన గౌడ కులసంఘ భవనాన్ని ప్రారంభించిన భువనగిరి మాజీఎంపీ బూర నర్సయ్యగౌడ్.మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గౌడ కులస్తుల సమావేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే రాజకీయాల్లో గౌడ కులస్తులు ముందుండాలన్నారు బీహార్ రాష్ట్రం నుండి తీసుకొచ్చిన ఐదువేల బీహార్ పొట్టి తాటి,ఈత విత్తనాలను పంపిణీ చేశారు.బిఎల్ఆర్ ఫౌండేషన్ ద్వారా కుల వృత్తులను బలోపేతం చేయడానికి కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత రాష్ట్రంలో కల్లుకు డిమాండ్ పెరిగిందని తెలిపారు ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన వృత్తి ఏదైనా ఉందంటే అది గౌడ కుల వృత్తి అని ఓటు హక్కు అనేది ఏ వర్గం అయితే సద్వినియోగం చేసుకుంటారో ఆ వర్గం ప్రజలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతరాని మండలంలోని గౌడ కులస్తులకు ఐదువేల తాటి,ఈత విత్తనాలు
పంపిణీ చేశారు ఈవిత్తనాల ద్వారా ఎకరానికి ఐదు లక్షల వరకు దిగుబడి పొందవచ్చున్నారు.ఈసందర్భంగా నూతనంగా నిర్మించిన గౌడ భవనం ప్రారంభించారు.ఈకార్యక్రమంలో సభ నిర్వాహకులు బొడ్డు నాగరాజ్ గౌడ్,కర్నాటి విద్యాసాగర్ రావు,మాజీ జెడ్పిటిసి సభ్యులు జాజుల అంజయ్య గౌడ్ మాజీ ఎంపీపీ పోలగోని సత్యంగౌడ్ అనంత లింగస్వామిగౌడ్,పోలగోని సైదులుగౌడ్,నకరకంటి యాదయ్య,వెల్లంకి యాదయ్యగౌడ్,శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.