మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రచారం
హుజూర్ నగర్ అక్టోబర్ 18 (జనం సాక్షి): మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు హుజూర్ నగర్ పట్టణ పార్టీ అధ్యక్షులు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి తెలిపారు. మంగళవారం మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఇన్ఛార్జిగా వ్యవహరిస్తోన్న హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఆదేశాల మేరకు పతంగి గ్రామంలో స్థానిక టీఆర్ఎస్, వామపక్షాల నేతలను సమన్వయపరుచుకుని పతంగి ప్రాంతంలోని ప్రజలకు ఇంటింటి ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల పై అవగాహన కల్పిస్తూ టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు యొక్క ఆవశ్యకతను వివరిస్తూ ప్రచారం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ యువజన కమిటీ అధ్యక్షులు సోమగాని ప్రదీప్ గౌడ్ , రాము , రవీందర్, హిందూజా, స్థానిక నాయకులు జనార్దన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.