మునుగోడు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి విజయానికి కృషి చేయాలి- కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖా శ్రీధర్ రెడ్డి
కొండమల్లేపల్లి అక్టోబర్ 23 (జనం సాక్షి) : నాంపల్లి మండలం లోని ముష్టిపల్లి, దేవత్ పల్లి పలు గ్రామాలలో మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాష్ నేత గార్లతో కలిసి కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేయాలని, ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని బ్రిటిష్ వాళ్లతో వీరోచితంగా పోరాడి దేశం కోసం సర్వం త్యాగం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని దేశం కోసం ఎన్నో సంస్కరణలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని బ్యాంకులను జాతీయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని దేశంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులను నిర్మించింది కాంగ్రెస్ పార్టీ అని ఎన్నో సంవత్సరాల త్యాగాల ఫలితం ఎందరో అమరవీరుల త్యాగ ఫలితం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజల, తెలంగాణ బిడ్డల బాగు కోసం సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ గారికి మునుగోడు ఎన్నిక గెలిపించి గిఫ్ట్ గా ఇద్దామని మరియు మునుగోడు కాంగ్రెస్ పార్టీ గడ్డ అని రాజకీయాలకు ప్రాలోబాలకు గురికాకుండా నీతికి, నిజాయితీకి పటం కట్టాలని మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డ పాల్వాయి స్రవంతిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎవరు ఎన్ని ప్రలోబాలకు గురిచేసిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటు వేయాలని తెలంగాణలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీ అని రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కాబోతున్నారని ప్రజలందరూ విజ్ఞతతో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి గారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దేవరకొండ మాజీ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్, టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాష్ నేత, కొండమల్లేపల్లి పిఎసిఎస్ చైర్మన్ డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి, సిరాజ్ ఖాన్, కొండమల్లేపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ వేమన్ రెడ్డి, వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, బచ్చనబోయిన శ్రీనివాస్ యాదవ్, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు భారీ ఎత్తున గ్రామ ప్రజలు, రైతులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు