మున్సిపల్‌ సమావేశంలో మహిళా కౌన్సిలర్‌ నిరసన

జగిత్యాల,జూలై30(జనంసాక్షి) : జగిత్యాల బల్దియా నెల వారి సాధారణ సమావేశం శనివారం మున్సిపల్‌ కార్యాలయ సమావేశ మందిరంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి అధ్యక్షతన జరిగింది. పలు అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలో జగిత్యాల పట్టణంలోని 13వ వార్డు కౌన్సిలర్‌ ఆసియా సుల్తానా పోడియం వద్ద బైఠాయించి మున్సిపల్‌ పాలక పక్షంపై నిరసన వ్యక్తం చేశారు. కౌన్సిల్‌ సమావేశాలకు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, అధికార పార్టీ తమపై పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తుందని ఇది ఎందుకు నిదర్శనం అని కౌన్సిలర్‌ వాపోయారు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ భోగ శ్రావణి పూర్తిస్థాయిలో బాధ్యత వహించి మున్సిపల్‌ కమిషనర్‌, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇక ముందు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆసియా పోడియం వద్ద నిరసన తెలుపుతుండగా తోటి కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు ఆమెకు మద్దతుగా నిరసనలో పాల్గొన్నారు.