మున్సిపాలిటీలో పెండింగ్ లో ఉన్న పనులను త్వరగతిన పూర్తి చేయాలి
-స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్-స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్
మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్ 28(జనంసాక్షి)
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం మహబూబాబాద్ మున్సిపాలిటి సిబ్బందితో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి మన్సిపాలిటి నందు జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించి పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చెయ్యాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ పరిదిలో సానిటేషన్ పనులు నిరంతరాయంగా జరగాలని, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రతిరోజు ఫాగింగ్ చెయ్యాలని సూచించారు. టౌన్ ప్లానింగ్ ద్వారా ఇప్పటి వరకు జారీ జారీ చేసిన నూతన ఇంటి అనుమతులను పరిశీలించి, రూల్స్ కు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు జరిగిన టౌన్ ప్లానింగ్ విభాగం బాధ్యులు పై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందనీ అదనపు కలెక్టర్ అన్నారు. మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని చెరువులను కాపాడడం పూర్తి బాధ్యత ఇర్రిగేషన్, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ పై ఉందని, ఇర్రిగేషన్ డిపార్ట్మెంట్ వారు చెరువుల యొక్క ఎస్టీఎల్ పరిధిలో ఎంతవరకు ఎంక్రోచ్ అయ్యిందో పూర్తి వివరాలు ఇవ్వాలని వాటికి సంబంధించి ఏమైనా కోర్ట్ కేసులు ఉన్నాయా వాటి యొక్క వివరములు, చెరువుల యొక్క ఎస్టీఎల్ పరిధి తో మొత్తం మ్యాప్ ఇవ్వాలని ఇర్రిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించారు. వీటి అన్నింటిని మున్సిపల్ కమిషనర్ పరిశీలించి మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలో ఎటువంటి అక్రమ కట్టడాలు జరగకుండా నియంత్రణ చేయాలనీ సూచించారు. ఈ సమావేశం లో మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి , డీఈ, ఏఈ, టిపిఓ/టిపిఎస్, సానిటరీ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు.