ముమ్మరంగా పైలేరియా మాత్రల పంపిణీ..
బోనకల్ , అక్టోబర్ 20,(జనం సాక్షి) :
జాతీయ పైలేరియా నిర్మూలన కార్యక్రమాన్ని పురస్కరించుకుని బోనకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గురువారం పైలేరియా మాత్రలు మింగించేందుకు వైద్య ఆరోగ్య శాఖాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా
బోనకల్ మండల వ్యాప్తంగా గురువారం చిన్నారులకు, విద్యార్థులకు, యువతి, యువకులకు , పెద్దలకు పైలేరియా నివారణ కోసం మందులను స్థానిక వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు ,ఆశలు, అంగన్వాడీ టీచర్లు, ఐకేపీ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది తదితర సిబ్బంది కలిసి మండలంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ పైలేరియా గోలీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ పిహెచ్సి సెంటర్లో అక్టోబర్ 20,21,22 తేదీలలో జాతీయ పైలేరియా నిర్మూలన కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని ప్రతి ఒక్కరు వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తరచూ వచ్చే కొద్దిపాటి జ్వరం, ఆయాసం, కాళ్లు చేతులు వాయడం వంటివి ఈ వ్యాధుల లక్షణాలని ఈ వ్యాధులు బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచన చేశారు. ఫైలేరియా ఒక కాళ్ళకే కాకుండా శరీరం మీద వివిధ భాగాలు కూడా వ్యాపిస్తుందని కాబట్టి సంవత్సరానికి ఒకసారి వ్యాధి నిరోధక మాత్రలు వాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు , ప్రజా ప్రతినిధులు,ఆయా గ్రామాల సర్పంచులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వైద్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ఆశాలు,ఐకేపీ సిబ్బంది, తదితర సిబ్బంది పాల్గొన్నారు .