ముమ్మరంగా బడి బాట కార్యక్రమం, బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించండి.

కోడేరు న్యూస్:-
కోడేరు (జనం సాక్షి) జూన్ 07  నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండల పరిధిలోని రాజాపూర్ గ్రామంలోబడి బాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయుల బృందాలు గడప గడప కు తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12 తేదిన స్కూల్స్ ప్రారంబం అయ్యాక మన ఊరు మన బడి అనే కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థిని విద్యార్థులకు కార్పోరేట్ విద్యకు ధీటుగా నాణ్యమైన ఆంగ్లభాష (ఇంగ్లీష్ మీడియం) లో విద్యా బోధన ఉంటుందని అదేవిధంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, మంచి పోషకాహారం లభించే విధంగా వారానికి మూడు సార్లు కోడి గుడ్లు,రెండు జతల ఏక రూప దుస్తులు, విద్యార్థులకు అందివ్వడం జరుగుతుందని జెడ్పీ,ఎచ్ ఎస్, ప్రధానోపాధ్యాయులు భాస్కర్ శర్మ మరియు ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఏటూరి శ్రీనివాస్ లు తెలిపారు.అదేవిధంగా విద్యా బోధన తో పాటు గేమ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు,భాలలసభ,ప్రతి నెల కొకసారి క్విజ్, పోటీలు, విద్యలో వెనుకబడ్డ విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ, ఆరోగ్య సమిక్షలో భాగంగా పాఠశాలలోనే విద్యార్థులకు వైద్య పరిక్షలు చేయుట, సాంఘీక పరిజ్ఞానం తో కూడిన విద్యాబోధన,మన ఊరు మన బడి, కార్యక్రమంలో భాగంగా కంప్యూటర్ విద్యను కూడా పొందే అవకాశం ఉంటుందని. ప్రధానోపాధ్యాయులు తెలిపారు.ఈ కార్యక్రమంలో  ఉపాధ్యాయుల బృందాలు అంగన్ వాడి టీచర్స్ తదీతరులు పాల్గొన్నారు.