ములుగు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
ములుగు బ్యూరో,ఆగస్ట్31(జనం సాక్షి):-
లయన్స్ క్లబ్ ఆఫ్ ములుగు గత ఆరు సంవత్సరాల నుండి గంగిశెట్టి సత్యనారాయణ ఐరన్ హార్డ్వేర్,లయన్ గంగిశెట్టి శ్రీనివాస్ సహకారంతో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణి కార్యక్రమం చేపడుతుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక పంపిణీ కార్యక్రమం చేపడుతూ ప్రజలు,భక్తులు మట్టి వినాయకులను పూజించాలని పర్యావరణాన్ని కాపాడాలని కోరుతున్నారు.ములుగు జిల్లా కేంద్రంలో మరియు వెంకటాపురం మండలం నర్సాపూర్ గ్రామంలో 235 మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు.ప్రజలందరూ కూడా మట్టి వినాయక విగ్రహాలు పూజించి పర్యావరణాన్ని కాపాడాలని ఈ విధంగా వారు కోరారు.ఈ యొక్క కార్యక్రమంలో ములుగు లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ చుంచు రమేష్,కోశాధికారి లయన్ మేరుగు రమేష్,క్లబ్ సభ్యులు లయన్ ఆడెపు రాజు, లయన్ మాట్ల బద్రి,ఎస్టియు జిల్లా అధ్యక్షులు ఎల్ల మధుసూదన్ మరియు పైడిపల్లి రాజు,చిప్ప రత్నాకర్,అజయ్,బంక రాజు ప్రజలు వినాయక భక్తులు పాల్గొన్నారు.