ముస్లింలకు 12శాతం రిజర్వేషన్‌ ఏది

మూడున్నరేళ్లయినా అమలుకు నోచుకోకపాయే

ఇమాం, మౌజంలకు పదివేల వేతనాలివ్వాలి

తెలంగాణా ముస్లిం రిజర్వేషన్‌ పోరాట కమిటీ డిమాండ్‌

కరీంనగర్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): తెలంగాణాలో ముస్లింలకు 12శాతం రిజర్వేషన్‌ ఇస్తామనిచెప్పి ఇప్పటికి దశాబ్దం దాటినా టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు పూర్తయినా కూడా ఆ ఊసెత్తడంలేదని, ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే ముస్లిం మైనార్టీలంతా ఉద్యమాలకు వెనుకాడేదిలేదని తెలంగాణా రాష్ట్ర ముస్లింరిజర్వేషన్‌ పోరాటకమిటీ రాష్ట్ర అద్యక్షుడు మొహిసిన్‌ ఆహ్మద్‌ ఖాన్‌ వెల్లడించారు. గురువారం స్థానిక ప్రెస్‌ భవన్‌లో ఆయన ఇతర నేతలు షేక్‌మదార్‌ నియాజ్‌, మొహ్మద్‌ ఒమర్‌ ఖాన్‌, మసూద్‌ ఖాన్‌, సయ్యద్‌ షా ఖాద్రి, మొహ్మద్‌ రిజోది ద్దీన్‌ సాజిద్‌, జఫర్‌ షాఖాన్‌, ఎండి జబ్బార్‌ ఖాన్‌ ఫేరోజ్‌, యూసుఫ్‌, అమ్జద్‌, అక్బర్‌ ఖాద్రి, సిరాజ్‌ సర్పోద్దీన్‌,లతో కలిసి స్థానిక ప్రెస్‌భవన్‌లో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్‌ రెండున్నరేల్ల కాలాన్ని సుదీర్‌ కవిూషన్‌ పేరుతో కాలం గడిపాడని, దీనిపై బీసీ కవిూషన్‌ వేసి మరో సంవత్సరం గడిపాడని నివేదిక వచ్చి ఆరు నెలలు దాటినా కూడా అమలుకు నోచుకోకపోవడం సిగ్గు చేటన్నారు. తమిళనాడు తరహాలో రిజర్వేషన్‌ అమలు చేస్తామన్న కేసీఆర్‌ అసెంబ్లీలో బిల్లు పెట్టినా బీజేపి మినహా అందరు ఆమోదించినా కూడా ఎందుకు అమలు చేయడంలేదని నిలదీశారు. అంతేకాక ముస్లింల పట్ల కేసీఆర్‌ నిర్లక్ష్యవైఖరిని ప్రదర్శిస్తున్నాడని మండిపడ్డారు ప్రక్క రాష్ట్రమైన ఆంద్రప్రదేశ్‌లో మసీదు ఇమాం, మౌజం లకు 8వేల చొప్పున వేతనంను చంద్రబాబు ఇస్తున్నాడని తెలంగానా సంపన్న రాష్ట్రమైనా కూడా నయాపైసా వేతనాలివ్వడంలేదని ఇదేనే కేసీఆర్‌కు మైనార్టీలపట్ట ప్రేమ అని నిలదీశారు. కేవలం వెయ్యి రూపాయలిచ్చి చేతులు దులుపుకుంటున్న కేసీఆర్‌ ఆ వెయ్యి రూపాయల వేతనంతో తాను స్వయంగా బతికి చూపించాలని డిమాండ్‌ చేశారు. అవి కూడా సక్రమంగా విడుదల చేయకుండా నిలిపివేస్తున్నారని ఆరోపించారు. పటాన్‌, మొఘల్‌, సయ్యద్‌ లను బీసీ ఈ కేటగిరిలో చేర్చాలని నివేదిక వచ్చినా కూడా ఎందుకు అమలు చేయడంలేదని, తహశీల్దార్‌లు ఎందుకు కుల సర్టిఫికెట్లు ఇవ్వడంలేదని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రధానంగా కేసీఆర్‌ ముందుకు వచ్చి తమ డిమాండ్లన్నింటిని నెరవేర్చాలని లేకుంటే ప్రత్యక్ష పోరాటాలకు దిగేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు.