ముస్లిం ఉద్యోగులకు రంజాన్‌ వెసులుబాటు

1

హైదరాబాద్‌,జూన్‌ 4(జనంసాక్షి):  రంజాన్‌ పండుగ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ప్రతి రోజు గంట ముందుగానే విధుల నుంచి ఇళ్లకు వెళ్లే వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌ 6 లేదా 7న నెలవంక కనిపించినప్పటి నుంచి రంజాన్‌ పండుగ అయిపోయే వరకు ముస్లిం ఉద్యోగులు గంట ముందే తమ ఇళ్లకు వెళ్లొచ్చని పేర్కొన్నారు.