మూడు రోజుల్లో 4.5 కోట్లతో దూసుకుపోతున్న కిరణ్ అబ్బవరం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ చిత్రం

.జనంసాక్షి. సెప్టెంబర్ 19

యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రాజా వారు రాణి గారు, ఎస్‌ఆర్‌ కల్యాణమండపం,సమ్మతమే చిత్రాలతో అలరించిన కిరణ్‌ తాజా చిత్రం “నేను మీకు బాగా కావాల్సినవాడిని”. కోడి రామకృష్ణ ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకు ఎస్‌ఆర్‌ కల్యాణమండపం డైరెక్టర్‌ శ్రీధర్‌ గాదే దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 16న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో మంచి కలక్షన్స్ ను రాబడుతుంది.
కేవలం నటుడిగానే గానే కాకుండా తనలో ఉన్న రచయిత టాలెంట్ ను కూడా తన రెండవ సినిమాతో నిరూపించుకున్నాడు హీరో కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం కిరణ్ చేసిన తాజా చిత్రం “నేను మీకు బాగా కావాల్సిన వాడిని”. ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా మాస్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తూ కమర్షియల్ హిట్ గా కొనసాగుతుంది.
ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ గారి కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సత్తాను చూపిస్తుంది. కేవలం మూడు రోజుల్లోనే 4.5 కోట్ల గ్రాస్ ను సాధించడం ఈ సినిమా విజయానికి నిదర్శనం అని చెప్పొచ్చు. ఏ బాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన ఒక హీరో సినిమా, ఈ స్థాయిలో ఆదరణ పొందడం అంటే మాములు విషయం కాదు. ఎట్టకేలకు ఈ చిత్రం కూడా మునుపటి చిత్రాలు లానే తెలుగు సినిమాకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది అని చెప్పొచ్చు.