మూడు రోజుల భారీ వర్షం

పొంగిపొర్లుతున్న వాగులు
కూలిన ఇల్లు
మహా ముత్తారం సెప్టెంబర్ 11( జనం సాక్షి)  మూడు రోజులపాటు మండలానికి సంబంధించిన అన్ని గ్రామాల కు భారీ వర్షం చుట్టుముట్టి  వర్షం పడడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఆదివారం మండలంలోని కిష్టాపూర్, పెగడపల్లి మధ్యలో ఉన్న వాగు. కొర్లగుంట, దెబ్బల పాడు మధ్యలో ఉన్న వాగు. వజినేపల్లి, మహా ముత్తారం మధ్యలో ఉన్న  లో లెవెల్ వాగులు బ్రిడ్జిల మీదికెల్లి ఉప్పొంగి పోవడంతో ఎక్కడికక్కడ రాకపోకలు నిల్వ చేయబడతాయి. వజినేపల్లి గ్రామానికి చెందిన ఆకు దారి సమ్మయ్య ఇంట్లో ఉండగా ఇల్లు  కూలి ప్రమాదం నుంచి బయట పడ్డారు. స్థానిక సర్పంచ్  గోక స్వర్ణలత స్పందించి తన కొడుకు వారి ఇంట్లో ఉంచుకోవాలని చెప్పడం జరిగింది. వర్షం కురుస్తుంది అన్న గ్రామస్తులు విద్యుత్ స్తంభాలు ముట్టుకోవడం కానీ ఇంట్లో మట్టి గోడల పక్కకు ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామ ప్రజలకు తెలిపారు. మండలంలో 24 గ్రామ పంచాయితీ సర్పంచులు  ముందస్తు పశువుల కాపరులకు మరియు గ్రామ ప్రజలకు వర్షం కారణం వల్ల ఎవరు బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాగులు వంకలు ఉప్పొంగి పోవడంతో ఎవరు దూరప్రయాణాలు వాయిదా వేసుకోవాలని గ్రామాలలో తెలియపరిచారు. మండల అధికారులు గ్రామాలలో జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు కీ సమాచారాన్ని తీసుకుంటూ తగుజాగ్రత్తలు ను  తెలియజేశారు.