మూడోసారి దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్‌: లైసెన్స్‌లు జారీ కాని మద్యం దుకాణాలకు ప్రభుత్వం మరకోమారు దరఖాస్తులను అహ్వానించింది. ఇప్పటీకీ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలో 679 మద్యం దుకాణాలకు లైసెన్స్‌లు పజారీ చేయలేదు. గతంలో వీటిపై వ్యాపారులు ఆసక్తి చూపలేదు. దీంతో 679దుకాణాలను ఆహ్వానిస్తూ జిల్లాల వారీగా మూడోసారి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈనెల 11వ తేది వరకు ధరఖాస్తులను స్వీకరిస్తారు. 12న లాటరీ పద్దతిని దుకాణాలను కేటాయిస్తారు. ఒకవేళ అప్పటికీ వ్యాపారులు ముందుకు రాకపోతే వెంటనే ఏసీబీసీఎల్‌ ఆధ్వర్యంలో ఔట్‌లెట్లు తెరవాలని ప్రభుత్వం ఎక్సైజ్‌ శౄఖ ఉన్నతాధికారులను ఆదేశించింది. ఎక్కువగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే దుకాణాలు ఖాళీగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 100, హైదరాబాద్‌లో 81దుకాణాలకు లైసెన్సులు తీసుకునేందుకు గతంలో ఎవరూ ముందుకు రాలేదు. తూర్పుగోదావరిలో 84, 74, పశ్చిమగోదావరిలో 63, విశాఖలో 56దుకాణాలతో పాటు మిగిలిన వాటికి మూడోసారి లైసెన్సులు కట్టబెట్టేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు.