మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజి ఎమ్మెల్యే ఆరెపల్లి
ఇల్లంతకుంట (జనంసాక్షి)
ఇల్లంతకుంట మండలంలోని వెంకట్రావుపల్లె గ్రామానికి చెందిన అనగోని బక్కయ్య గౌడ్ మృతి చెందగా మృతుడి కుటుంబాన్ని గురువారం మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆరెపల్లి మోహన్ పరామర్శించాడు.ఈ సందర్భంగా ఆరెపల్లి మోహన్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఏ సమస్య వచ్చినా గ్రామాల్లో యువత తనకు సమాచారం ఇవ్వాలని తెలిపాడు.ఈ కార్యక్రమంలో భూంపెళ్లి రాఘవరెడ్డి ,అంబేద్కర్ సంఘము నాయకులు భూమయ్య, దుద్దేడ బాలయ్య ,చల్ల నవీన్,బత్తిని లక్ష్మణ్ గౌడ్,జేట్టి లక్ష్మణ్ ,కడగండ్ల తిరుపతి, జాగిరి రమేష్ గౌడ్,అల్లాడి చంటి తదితరులు పాల్గొన్నారు.