మెగా జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలి -తుల అరుణ్ కుమార్
బజార్ హత్నూర్ (జనం సాక్షి ) : ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు లేక బాధ పడుతున్న నిరుద్యోగ యువతకు అండగా ఉండేందుకు వారికి ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 15 మరియు 16 వ తేదీలలో ఉస్మానియా యూనివర్సిటీ తార్నాక, హైదరాబాద్ లో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని తుల సుభాష్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ తుల అరుణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు ఆయన మాట్లాడుతూ నిపుణ సేవ ఇంటర్నేషనల్ కోమటి రెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్,తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంల ఆధ్వర్యంలో 250 కి పైగా కంపెనీల తో 20 వేల ఉద్యోగాల కోసం మెగా జాబ్ మేళా ను నిర్వహిస్తున్నామని ఈ జాబ్ మేళా లో 2012 నుండి 2022 లో టెన్త్, ఇంటర్,డిగ్రీ, పిజి, బీ టెక్, ఎం టెక్, ఎంబీఏ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ పూర్తి చేసుకున్న నిరుద్యోగ యువత అర్హులు అని వీరికి ఐటీ, కోర్, మేనేజ్ మెంట్, ఫార్మా, బ్యాంకింగ్ రంగాలలో ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి గల యువకులు 9032586124, 9059186124,9032186124 నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు