మెట్ట పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి
వినుకొండ, జూలై 17 : మెట్ట పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని మండల కేంద్రమైన నూజేళ్ల ఏవో రమేష్ సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఆదర్శ రైతులతో సమవేశం నిర్వహించారు. సమావేశంలో రమేష్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ ఏడాది సాధరణం కంటే 30 శాతం తక్కువ వర్షపాతం నమోదు అయిందని అన్నారు. రైతులు మెట్ట పంటలు సాగు చేయాలని ఆయన సూచించారు. కంది, పత్తి, సజ్జ వంటివి సాగు చేయాలని అదేవిధంగా రైతులకు యాజమాన్య పద్ధతుల గురించి వివరించాలని రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవో అప్పారావు, ఆదర్శ రైతులు తదితరులు పాల్గొన్నారు.