*మెట్పల్లిలో నూతన మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ రవి*

మెట్పల్లి టౌన్ ,అక్టోబర్ 18, జనంసాక్షి
మెట్పల్లి పట్టణ కేంద్రంలో మంగళవారం రోజున జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి పట్టణంలోని వెల్లుల్ల రోడ్డులో నూతనంగా నిర్మాణం జరుగుతున్న కూరగాయల, మరియు చేపల మాంస మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించారు,
అనంతరం కలెక్టర్ రవి మాట్లాడుతూ నిర్మాణ పనులు నాణ్యతగా ఉండాలని ,పనులు త్వర త్వరగా పూర్తి చేయాలని, నిర్మాణ పనుల గురించి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉండాలన్నారు, అలాగే ఎప్పుడైనా పరిశీలనకు వస్తానని అన్నారు . తొందరగా నాణ్యత లోపం లేకుండా పనులు పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుంటారని త్వరగా ప్రజలకు అందుబాటులో తేవాలని అన్నారు , కలెక్టర్ రవి తో పాటు అసిస్టెంట్ కలెక్టర్ అరుణశ్రీ ,ఆర్డీవో వినోద్ కుమార్ మున్సిపల్ చైర్మన్ రానావేని సుజాత సత్యనారాయణ ,మున్సిపల్ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు ,కమిషనర్ సల్వాది సమ్మయ్య ,కోరుట్ల మెట్పల్లి డి ఈ, ఏఈ ఉన్నతాధికారులు, పాల్గొన్నారు