మెట్రోప్రయాణికుని వధ 10 రూ అదనపు వసూలు కు మెట్రో సిబ్బందిపై10 వేలు జరిమానా విధింపు.
మెట్రోప్రయాణికుని వధ 10 రూ అదనపు వసూలు కు మెట్రో సిబ్బందిపై10 వేలు జరిమానా విధింపు
ఇల్లందు అక్టోబర్ 18 (జనం సాక్షి న్యూస్) హైదరాబాద్ లోని
మెట్రో రైల్వే స్టేషన్ లో ఒక వైపు నుండి ఇంకొక వైపు వెళ్లి కాలకృత్యాలు తీసుకోవడంతో టాయిలెట్ సౌకర్యాన్ని ఉపయోగించడం కారణంగా పది రూపాయలు అదనంగా వసూలు చేసిన రుసుం తిరిగి ప్రయాణికుడుకు చెల్లించాలని ఖమ్మం జిల్లా వినియోగదారుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చైర్మన్ వి. లలిత, సభ్యురాలు ఎ.మాధవీలత తీర్పునిచ్చారు
కేసు వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన న్యాయవాది వెల్లంపల్లి నరేంద్ర స్వరూప్ ఖమ్మం నుండి కోర్టు విధుల నిమిత్తం హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో రైల్వే స్టేషన్లో 18/1/2019న ఉదయం 10-15 గంటలకు ఎల్‌బి నగర్ మెట్రో స్టేషన్‌లో రైలు ఎక్కడానికి ఎలివేటర్ ద్వారాఎక్కిస్టేషన్ లో ప్రవేశించారు. మెట్రో రైలు ఎక్కేందుకు వెళ్లే తూర్పు వైపు దారిలో టాయిలెట్లు లేకపోవడంతో పడమర వైపు ఉన్న వేరే దారిలో వెళ్లారు. దీని కోసం ఫిర్యాదు దారుడు మెట్రో రైల్వే జారీ చేసిన ట్రావెల్ కార్డ్ నెబ్యులా నంబర్ 10100010225476ను స్వైప్ చేయాల్సి వచ్చింది. ఫిర్యాదు దారుడు మళ్లీ అసలు మార్గానికి తిరిగి వచ్చారు. ఇందు కోసం ఫిర్యాదు దారుడు మళ్లీ ట్రావెల్ కార్డ్‌ని స్వైప్ చేయాల్సి వచ్చింది. మరియు కేవలం ప్రకృతి కాల్‌కు హాజరైనందుకు ప్రీపెయిడ్ ట్రావెల్ కార్డ్ నుండి రూ.10/- తీసివేయబడింది. ఫిర్యాదు దారుడు రైలు ఎక్కేందుకు లిఫ్ట్ ఎక్కే దారిలో మరుగుదొడ్లు లేకపోవడంతో ఇది జరిగింది. పిర్యాదు దారు రెండో వైపు మార్గంలో ఉన్న టాయిలెట్లకు వెళ్లడానికి కార్డును స్వైప్ చేయాల్సి వచ్చింది. వినియోగదారుని తప్పు లేకుండా రూ.10/- నా ప్రీపెయిడ్ ట్రావెల్ కార్డ్ నుండి తీసివేయబడింది. రోజూ ఇదే రీతిలో మెట్రో రైలులో ప్రయాణించే పెద్ద సంఖ్యలో ప్రయాణికులకు ఇదే నష్టం వాటిల్లు తోంది అని పిర్యాదు లో పేర్కొన్నారు. ఇరువైపులా మరుగుదొడ్లు ఏర్పాటు చేయకపోవడం మెట్రో రైలు వారు తీవ్ర నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారని, కేవలం ప్రకృతి కాల్‌కు హాజరైనందుకు ప్రయాణికుల నుంచి అదనపు రుసుం వసూలు చేయడం, అసమంజసం, అన్యాయం గా ముందని. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు స్టేషన్‌లోని ప్రతి మార్గంలో వాష్‌రూమ్ సౌకర్యం వంటి ప్రాథమిక అవసరాలను అందించాలని కనీసం డిస్ప్లే బోర్డులు స్టేషన్లో పెట్టాలని కనీస సౌకర్యాలు కల్పించడం అన్నది ప్రయాణ మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మెట్రో రైలు సంస్థకు ఉందని పేర్కొన్నారు.ఈ విషయమై ఖమ్మం జిల్లా వినియోగదారుల మండలం కమిషన్లో ఫిర్యాదు చేశారు.
మెట్రో రైల్వే స్టేషన్ లో ఒక వైపు నుండి ఇంకొక వైపు వెళ్లి కాలకృత్యాలు తీసుకోవడంతో టాయిలెట్ సౌకర్యాన్ని ఉపయోగించడం కారణంగా పది రూపాయలు అదనంగా వసూలు చేసిన రుసుం తిరిగి ప్రయాణికుడుకు చెల్లించాలని, ప్రయాణికుల సౌకర్యార్థం డిస్ప్లే బోర్డులు పెట్టాలని ఆదేశించారు అదేవిధంగా ప్రయాణికునికి జరిగిన అసౌకర్యానికి 5000 రూపాయలు మరియు ఫిర్యాదుదారుకు అయిన ఖర్చులు వేదనకు గురి చేసినందుకు, ఫిర్యాదుదారు ఖర్చులకు గాను 5వేల రూపాయలు 45 రోజుల్లోపు చెల్లించాలని ఖమ్మం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చైర్మన్ వి.లలిత, సభ్యురాలు మాధవి లత తీర్పునిచ్చారు. ఫిర్యాదుదారుని తరపున వెల్లంపల్లి నరేంద్ర స్వరూప్,వీరన్న, కె.శరత్ బాబు న్యాయవాదులు గా ఈ కేసును నమోదు చేశారు.