*మెడికల్ కాలేజ్ భూ నిర్వాసితులకు న్యాయం కోసం బిఎస్పీ కలెక్టరేట్ ముట్టడి*

జనం సాక్షి నాగర్ కర్నూల్ టౌన్ : నాగర్ కర్నూల్ జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ దళితులు సాగు చేసుకుంటున్న భూమిని సర్వే నంబర్ 237 లో విస్తీర్ణం 40 ఎకరాలలో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మించారు. తదనంతరం దళితులు ఇచ్చిన భూమి సరిపోక, ఇంకా ఇవ్వాలంటూ అధికారులు అక్కడి ప్రజలను ఒత్తిడి చేశారు వీరికి బహుజన్ సమాజ్ పార్టీ మద్దతిస్తూ కలెక్టర్ కార్యాలయం ముట్టడించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బిఎస్పి అసెంబ్లీ ఇంచార్జ్ కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి దళితుల భూమిని అక్రమంగా లాక్కోవడానికి నీకు ఎలాంటి అధికారం, లేదని వెంటనే వారు సాగు చేసుకుంటున్నా భూములలో మెడికల్ కళాశాల పనులు నిలిపివేసి, పోలీసుల నుండి రక్షణ కల్పించాలని, ఆ దళిత కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని, డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు అంతటి నాగన్న, జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపల్లి కుమార్, అసెంబ్లీ కమిటీ అధ్యక్షులు పృథ్వీరాజ్, మరియు తదితర నాయకులు పాల్గొన్నారు