మెదక్ అసైన్‌మెంటు కమిటీ 27కు వాయిదా
ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతురావు
మెదక్, నవంబర్ 8 : మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ అసైన్‌మెంట్ కమిటీ సమావేశం ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేసినట్లు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతురావు ప్రకటించారు. గురువారం నాడు మెదక్ తాహాశీల్దారు కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో … సమావేశానికి సంబంధించిన సమాచారం పూర్తి నివేదికలను మాజీ శాసనసభ్యులు శశిధర్‌రెడ్డి, పద్మదేవేందర్ రెడ్డిలకు లబ్దిదారుల లిస్టులను ఇవ్వాలని తాహశీల్దారును ఆదేశించారు. సమావేశ సమాచారాన్ని మెదక్ పట్టణంలోని అన్ని పత్రికల విలేకరులకు ఇవ్వాలని ఆదేశించారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతురావు మట్లాడుతూ మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అర్హులైన పేదలకు రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా పంపిణీ చేస్తామని తెలిపారు. మెదక్ సబ్ కలెక్టర్ భారతి హోళ్ళికేరీ లబ్దిదారులను గుర్తించేందుకు నియోజకవర్గంలో పర్యటించి లబ్దిదారులను గుర్తించినట్లు ఆయన తెలిపారు. అసైన్‌మెంటు కమిటీ సమావేశం నిర్వహించే లోగా లబ్దిదారుల లిస్టులను మాజీ ఎమ్మెల్యేలకు పంపిణీ చేయాలని తెలిపారు. నవంబర్ 27వ తేదీ లోపల అర్హులైన వారు సాగు భూమికోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శిశిధర్‌రెడ్డి, అసైన్‌మెంటు కమిటి సభ్యులు మాన్‌రెడ్డి, మండల కిషన్‌గౌడ్, అరునార్తి వెంకటరమణ, తాహాశిల్దార్ శివరామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.