మెప్మా గృహాల్లో వసతుల కల్పనకు చర్యలు

విజయవాడ,మే4(జ‌నంసాక్షి): పట్టణ ప్రాంతాల్లో ఉండే నిరాశ్రయులకు, వలసలపై వచ్చిన కూలీలకు వసతి కల్పించేలా మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించే నిరాశ్రయుల వసతిగృహాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించారని రాష్ట్ర వసతి గృహాల పర్యవేక్షణ కమిటీ(ఎస్‌ఎల్‌ఎంసీ) చైర్మన్‌ జేసీ శర్మ తెలిపారు. నగరంలోని పురపాలక శాఖ గెస్ట్‌హౌస్‌లో  ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న నిరాశ్రయ వసతి గృహాలను మెరుగుపరుస్తామన్నారు. మునిసిపల్‌ కమిషనర్‌, పోలీస్‌, ఎన్జీవోల సహకారంతో ఇప్పటికీ రోడ్లు, ఫుట్‌పాత్‌పై ఉండే నిరా శ్రయులకు అవగాహన కల్పించి తాత్కాలిక వసతి గృహాల ఏర్పాటుకు మెప్మాకు సూచనలు చేశారు పేదలకు భోజన సదుపాయం కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. సమావేశంలో మెప్మా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వరరావు, ఇర్ఫాన్‌ బాషా, టె క్నికల్‌ ఎక్స్పర్ట్‌ జె.రవికాంత్‌, మెప్మా జిల్లా మిషన్‌ కో-ఆర్డినేటర్‌ పద్మజ, రాష్ట్ర ఎన్జీవో సెక్రటరీ ధర్మతేజ, రూట్స్‌ ఫౌండేషన్‌ ఎన్జీవో డాక్టర్‌ విజయ్‌ భాస్కర్‌ పాల్గొన్నారు.