మెరీడియన్ స్కూల్ లో “కిటోలిట్”
మేడిపల్లి – జనంసాక్షి
మెరీడియన్ పాఠశాల ఉప్పల్ శాఖలో కిటోలిట్ అద్భుతమైన సౌకర్యాన్ని ప్రారంభించారు. నవీన యుగంలో విద్యా, సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థులలో ఎంతైనా అవసరం ఉంది. భవిష్యత్ తరం దృష్టిలో పెట్టుకుని ప్రారంభించిన ఈ ప్రోగ్రాం విద్యార్థులలో నవీన ఆలోచనలు రేకెత్తించాయి. కిటోలిట్ ద్వారా విద్యార్థులు స్మార్ట్ లైట్లు, రోబోటిక్స్ కార్, స్మార్ట్ హాస్పిటల్, ఆటోమిషన్, డాన్సింగ్ రోబోట్, స్మార్ట్ వాటర్ ట్యాంక్ గురించి విద్యార్థులు తల్లిదండ్రులకు, తోటి విద్యార్థినీ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వివరించారు. ఈ కిటోలిట్ ప్రోగ్రాంలో పాఠశాల చైర్ పర్సన్ మాధురి రెడ్డి, ప్రిన్సిపల్ రోజా ఫాల్ పాల్గొన్నారు.