మేధావులను నిర్లక్ష్యం చేసింది నిజంకాదా?

బిజెపి నేత విమర్శలు
ఆదిలాబాద్‌,అక్టోబర్‌5 (జనంసాక్షి):  తెలంగాణ ఉద్యమంలో చేయూతనిచ్చి, ముందుకురికిన మేధావులు కేసీఆర్‌ పాలనను ఛీకొడుతున్నారని బిజెపి అధ్యక్షుడు పాయల శంకర్‌ అన్నారు. మేధావునలు ఏనాడు పట్టించుకోకుండా, వారి ఆలోచనలను పంచుకోకుండా చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దన్నారు. ప్రజల ఎజెండానే మహాకూటమి ఎజెండా అని  ఆయన తెలిపారు. ప్రజల ఆకాంక్షలైన నిధులు, నీళ్లు, ఉద్యోగాలే తమ ఎజెండా అన్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నీరుగార్చిన టిఆర్‌ఎస్‌కు గుణపాఠం తప్పదన్నారు. ప్రజలను నిజాం నిరంకుశ పానలలోకి తీసుకుని వెళ్లిన ఘనత కెసిఆర్‌దని అన్నారు.
అందుబాటులో ప్రభుత్వం, ప్రజల మధ్య ప్రభుత్వం అనే నినాదంతో రానున్న ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నామన్నారు. నియంతృత్వం కావాలో, ప్రజాస్వామ్యం కావాలో ప్రజలను తేల్చుకుంటారని అన్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై చర్చ చేస్తే  ఏమేర అభివృద్ధి జరిగిందో తెలుస్తుందన్నారు. /ుపక్షాలపై విరుచుకు పడడం మినహా చేసిందేవిూ లేదన్నారు.విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, పోరాట యోధులంతా  మహాకూటమికి మద్దతు తెలుపుతున్నారన్నారు.