మేనల్లుడితో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవు : బన్సల్
న్యూఢిల్లీ : లంచం తీసుకుంటూ సీబీఐకి దొరికిపోయిన తన మేనల్లుడు వి.సింగ్లాతో తనకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సల్ వెల్లడించారు. ఈ వ్యవహారంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. కుమార్ అనే వ్యక్తికి రైల్వేలో ఉన్నత హోదా ఇప్పించడం కోసం మధ్యవర్తిగా వ్యవహరించిన మంజునాధ్ వద్ద రూ. 90 లక్షలు లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై నిన్న సింగ్లాను సీబీఐ అరెస్టు చేసింది.