మైనర్ బాలికుడిని క్లినర్ గా పెట్టుకుని చంపేశారు

-సమీర్ మృతికి కారణమైన నిర్మల పాఠశాలపై చర్యలు తీసుకోవాలి

-ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, డివైఎఫ్ఐ, పీడీఎస్యూ డిమాండ్

మహబూబాబాద్ బ్యూరో-ఫిబ్రవరి11 (జనంసాక్షి)

 

స్కూల్ బస్సు ప్రమాదంలో మృతిచెందిన సమీర్ కుటుంబానికి న్యాయం చేయాలని వారి కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని గార్ల నిర్మల పాఠశాల గుర్తింపు రద్దు చేయాలనీ పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని గిరిజన సంఘం గార్ల మండల కమిటీ ఆధ్వర్యంలో పాఠశాల ముందు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, డివైఎఫ్ఐ, పీడీఎస్యూ ల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారరు. ఈసందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సాయికుమార్ మాట్లాడుతూ బ్రతుకుదెరువు కోసం చతిస్గడ్ నుంచి వలస వచ్చిన సమీర్ ను అన్యాయంగా చంపేసారంటూ నిర్మల యాజమాన్యంపై తీవ్రంగా మండిపడ్డారు. బాల కార్మికులు పనిలో పెట్టుకొని వాళ్ల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. గార్ల మండలం కేంద్రంలో ఉన్న ప్రైవేటు నిర్మల పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా ఓ నిండుప్రాణం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.. సమీర్ మృతి కి కారకులైననిర్మల పాఠశాల యాజమాన్యం చర్యలు తీసుకోవాలని. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని, సమీ కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి సూర్య ప్రకాష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్, పిడిఎస్యు జిల్లా నాయకులు మహేష్, డీవైఎఫ్ఐ మండల నాయుకులు కొండయ్య, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు. భూక్యా హరినాయక్, ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి మాగం లోకేష్. ఎస్ఎఫ్ఐ మండల నాయుకులు. రంజిత్, తరుణ్, వెంకటేష్, సిదర్థ, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.