మైనార్టీ ఉపకారవేతనాలు ఇవ్వండి..
– చీఫ్ విప్ వినయ్ భాస్కర్ కు వినతి పత్రం.
ములుగు జిల్లా బ్యూరో, సెప్టెంబర్ 15 (జనంసాక్షి):-
ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న మైనార్టీ విద్యార్థులకు ఉపకారవేతనాలు రావడం లేదని, ఉపకారవేతనాలకు ఆదాయ ధ్రువీకరణ పత్రం జతపరచాలని, లక్ష రూపాయల ఆదాయం మించరాదని ప్రభుత్వం ఇచ్చిన జీవో వల్ల విద్యార్థులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయని ఆ వినతిపత్రంలో తెలిపారు. గురువారం హన్మకొండ జాక్ చైర్మన్ తాడిశెట్టి క్రాంతి కుమార్ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ కు ఇచ్చిన వినతిపత్రం లో కోరారు. ప్రభుత్వ విధానం వల్ల విద్యార్థులు తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇట్టి విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి తగిన న్యాయం చేయాలని కోరారు. ఆదాయ నిబంధన లేకుండా ఉపకారవేతనాలు ఇచ్చేలా చూడాలని లేదా ఆదాయ పరిమితి ఒక లక్ష నుండి రెండున్నర లక్షల వరకు పెంచే విధంగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మైనార్టీ కి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ విషయంలో ఇలా చేయడం తల్లిదండ్రులకు చాలా ఆవేదనకు గురి చేస్తుందని అన్నారు. ఇట్టి విషయమై స్పందించిన చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తక్షణమే కలెక్టర్, ఎమ్మార్వో తో పాటు విద్యాశాఖ, మైనారిటీ వెల్ఫేర్ వారితో కూడా మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వాజిద్ అలీ, సునీత, నాగలక్ష్మి, మాధవి, సౌజన్య, అమృ, గౌసియా, నూరి, సమీనా, స్వప్న, శిరీష ,గాయత్రి, విద్యార్థులు పాల్గొన్నారు.
Attachments area