మైనార్టీ ఉపకార వేతనాల పై సమీక్ష నిర్వహించండి
– మైనార్టీ జిల్లా అధ్యక్షులు యండి యాకూబ్ పాషా
కొత్తగూడెం జనంసాక్షి (అక్టోబర్ 17) : కేంద్ర మైనార్టీ మంత్రిత్వ శాఖ వారు అందిస్తున్న పలు ఉపకార వేతనాల పై సబంధిత విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించాలని మైనార్టీ జిల్లా అధ్యక్షులు యండి. యాకూబ్ పాషా సోమవారం ప్రజా వాణి లో జిల్లా కలెక్టర్ అనుదీప్ ను కోరారు. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశా లలు కళాశాల యాజమాన్యాలు తమ విద్యా సంస్థ వివరాలను “నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్ ” నందు నమోదు చేసుకోనందున అట్టివిద్యా సంస్థల పేర్లు పోర్టల్ నందు చూపించవని దీని కారణంగా జిల్లా వ్యాప్తంగా అనేక మంది పేద మైనార్టీ విద్యార్థులు కేంద్ర మంత్రిత్వ శాఖ వారు అందిస్తున్న పలు ఉపకార వేతనాలకు ధరఖాస్తు చేసుకో లేక నష్ట పోతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకు వెల డంతో తప్పకుండా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి అశోక చక్రవర్తి , జిల్లా మైనార్టి అధికారి సంజీవ రావు గార్లకు అదేశించినట్లు యాకూబ్ పాషా విలేఖరుల కు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వర్ మియా , జాకీర్ హుస్సేన్ , హుస్సేన్ ఖాన్ పాల్గొన్నారు .