మైనింగ్ క్వారీ ఏర్పాటు ను అడ్డుకున్న స్థానిక రైతులు

మైనింగ్ క్వారీ ఏర్పాటుపై న్యాయ విచార‌ణ జ‌ర‌పాలి

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- మొండిగౌరెల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ ఆసైన్డ్ భూమి సర్వే నెంబర్ 19 లో మైనింగ్ క్వారీ ఏర్పాటు చేస్తున్న మైనింగ్ వ్యాపారులు దీనిపై న్యాయ విచారణ చేసి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరిన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండిగౌరెల్లి గ్రామానికి  చెందిన నిరుపేద రైతులు,మా గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 19 లో  ప్రభుత్వం భూమి లేని ఎస్సి ,బిసి కులాల నిరుపేదలకు భూపంపిణీ చేసి సర్టిఫికెట్ ఇచ్చినది,ఎన్నో ఏండ్లుగా తరతరాలుగా భూమిని సాగు చేసుకొని జీవనం గడుపుతున్నాము. పకీరోని చెరువు కట్టపై నుండి భారీ వాహనాలకు అనుమతి లేదని ఇప్పటికే తెల్పిన ఇరిగేష్ అధికారులు అయినా కానీ నేడు అతి భారీ హిటాచీ వాహనాల రవాణా వలన చెరువు కట్ట ద్వoసం అయ్యింది, ఎన్నిసార్లు అడ్డుకున్న కానీ వ్యాపారులు ప్రయత్నం చేస్తున్నారు గతంలో యాచారం తహసీల్దార్ కి ఈ విషయం పైన రైతులు పిర్యాదు చేయగానే వెంటనే స్పందించి భారీ వాహనాలు గుట్టకు వెళ్లకుండా నిలుపుదల చేసినారు, ఇలాగే ప్రయత్నాలు చేస్తే ఉద్యమం చేసి మైనింగ్ కంపెనీలను రాకుండ అడ్డుకుంటామని  అని రైతులు తెల్పినారు,మా  భూములకు సరిహద్దుల్లో 19 సర్వే నెంబర్ లోనే  మైనింగ్ క్వారీ ఏర్పాటు వల్ల మా భూములు పాడై కాలుష్యం అయ్యే ప్రమాదం ఉన్నది కావున తక్షణమే ఈ విషయంపై న్యాయ విచారణ జరిపించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని రైతులు కోరినారు,ఇప్పటికే ఈ విషయం పైన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి,ప్రిన్సిపల్ సెక్రటరీ మైనింగ్ కి,పొల్యూషన్ కంట్రోల్ బోర్డు,బోర్డు ఆఫ్ బయోడైవర్సిటీ,డిపార్ట్మెంట్ ఆఫ్ ఇరిగేష్ తెలంగాణ కి ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వలన మళ్ళీ మైనింగ్ పనులు ప్రారంభించిన వ్యాపారులు,తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి మైనింగ్ వ్యాపారులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మొండిగౌరెల్లి రైతులు,పకీరోని చెరువు మత్స్యకారులు మరియు గ్రామ ప్రజలు అంటున్నారు